Tuesday, August 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యాశాఖ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలి..

విద్యాశాఖ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలి..

- Advertisement -

నాగర్ కర్నూల్  ఎంఈఓ చంద్రుడు..
నవతెలంగాణ – వెల్దండ
ప్రభుత్వం , విద్యాశాఖ నిర్దేశించిన ఆదేశాలను ఆయా పాఠశాలలలో తప్పనిసరిగా పాటించాలని వెల్దండ ఎంఈఓ చంద్రుడు అన్నారు. వెల్దండ మండల పరిధిలోని పోతే పెళ్లి ప్రభుత్వ పాఠశాలను వెల్దండ ఎంఈఓ చంద్రుడు సోమవారం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ.. అడ్మిషన్ రిజిస్టర్స్  ఆన్లైన్ ఎన్రోల్మెంట్  చేయాలని  సూచించారు. బేస్ లైన్ ,  ఎఫ్ ఏ 1 రిజల్ట్స్ ని ఆన్లైన్లో నమోదు చేయగలరని సూచించారు. పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా ఉంచాలని , టాయిలెట్స్ దగ్గర సోప్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ప్రతిరోజు ఎఫ్ ఆర్ ఎస్ స్టూడెంట్స్ ,  టీచర్స్ ను ఇన్ టైం లో తీసుకోగలరని సూచించారు.  మధ్యాహ్నం భోజనం పరిశీలించి మెనూ ప్రకారం మాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల ఫోన్ నెంబర్స్ తో వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేసి సాయంత్రం వారికి ఇచ్చిన హోంవర్క్ అందులో పంపించే విధంగా  ముందడుగు వేయాలని సూచించారు. అనంతరం పాఠశాలలోని విద్యార్థుల సామర్ధ్యాలను  పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం తోపాటు ఉపాధ్యాయ సిబ్బంది ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -