నవతెలంగాణ హైదరాబాద్: బీఆర్ఎస్ కు ఒకేరోజు భారీ షాక్ తగిలింది. ఒకరి తరువాత ఒకరు ఒకే ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు ఆ పార్టీకీ రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ వెంటనే అదే బాటలో మరో ఇద్దరు సీనియర్లు నేతలైన అలంపూర్ మాజీ ఎమ్మెల్యే అబ్రహం, నాగర్ కర్నూల్ మాజీ శాసనసభ్యులు మర్రి జనార్ధన్ రెడ్డి కూడా రాజీనామా చేసినట్టు సమాచారం. అయితే రాజీనామాకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
ఇప్పటికే ఆ పార్టీ అధినేత కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పై విరుచుకుపడుతున్నారు. మరోవైపు కాళేశ్వరం విషయంలో, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తుండటం గులాబీ నేతలను కలవరపెడుతోంది. దీంతో అసలు బీఆర్ఎస్ లో ఏం జరగబోతుంది అన్నది ఇప్పుడు వరుస రాజీనామాలు రాష్ట్ర రాజకీయాల్లో హట్ టాఫిక్ గా మారింది.