నవతెలంగాణ-హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ నివేదికను త్వరలో అసెంబ్లీలో ప్రవేశపెడతామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు.క్యాబినెట్ భేటీ అనంతరం మంత్రులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు. కాళేశ్వరం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ సమర్పించిన నివేదిక ()కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని సీఎం () వెల్లడించారు. విచారణకు సంబంధించిన వివరాలను కమిషన్ విశ్లేషణాత్మకంగా నివేదికలో పొందుపరిచిందని చెప్పారు.అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నాక భవిష్యత్తు కార్యాచరణతో పాటు కమిషన్ సూచనలను అమలు చేసేందుకు ముందుకెళ్తామని సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. ఎవరిపైనా కక్ష సాధింపులు, వ్యక్తిగత ద్వేషం తమ ఉద్దేశం కాదనే అన్ని వివరాలనూ మీడియా ముందు ఉంచామని తెలిపారు.
కాళేశ్వరం కమిషన్ నివేదికను త్వరలో అసెంబ్లీలో ప్రవేశపెడతాం: సీఎం రేవంత్‌రెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES