నవతెలంగాణ – వలిగొండ రూరల్
పొద్దుటూరు సీపీఐ(ఎం) గ్రామ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ప్రజావాణి సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డికి, యాదగిరి గుట్ట డిపో మేనేజర్ కుఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని కల్పించాలని కోరుతూ సోమవారం వినతి పత్రం అందజేశారు.
క్షౌర వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి చెన్నారం మల్లేష్, సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు దుబ్బ లింగం మాట్లాడుతూ.. పొద్దుటూరు గ్రామానికి వెంటనే బస్సు సౌకర్యం కల్పించాలన్నారు. గ్రామానికి బస్సు లేక ప్రొద్దుటూరు ఏదుల్లగూడెం గ్రామాల నుండి వలిగొండ మండల కేంద్రానికి, జిల్లా కేంద్రానికి విద్యనుభ్యసించేందుకు కళాశాల, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు రాకపోకలు కొనసాగించడానికి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని వందల రూపాయల్ని ఖర్చు పెడుతూ చదువులు కొనసాగించాల్సి వస్తుందని ప్రొద్దుటూరు నుండి ఎదుల్లగూడెం స్టేజి వరకు రావడానికి 5 కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి ఎదురవుతుందన్నారు.
ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక విద్యార్థులతో పాటు వివిధ పనులకు ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లే ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని వెంటనే గతంలో నడిచిన ఆర్టీసీ బస్సును పునర్ ప్రారంభించి నడపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బస్సు వెంటనే ప్రారంభించకపోతే పొద్దుటూరు గ్రామ ప్రజలతోపాటు విద్యార్థులను యువతను సమీకరణ చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు, సీపీఐ(ఎం) గ్రామ శాఖ నాయకులు బత్తుల నరసింహ, పెద్ద బోయిన భీమరాజు, ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షులు మైసొల్ల నరేందర్,తదితరులు పాల్గొన్నారు.