Tuesday, August 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు: ఎమ్మెల్యే

అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు: ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
అర్హులైన ప్రతి ఒక్కరికి ఆహార భద్రత కార్డులు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు పేర్కొన్నారు. సోమవారం డోంగ్లి మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో కొత్త రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతూ నిరుపేదలకు ఆదుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, డోంగ్లి మండల ఆర్ఐ సాయిబాబా, డోంగ్లి సింగిల్ విండో మాజీ చైర్మన్ శివాజీ పటేల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రెవెన్యూ అధికారులు, కొత్త రేషన్ కార్డుల లబ్ధిదారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -