నవతెలంగాణ – నాగిరెడ్డిపేట
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావును నాగిరెడ్డిపేట్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం కలిశారు. నాగారెడ్డిపేట గ్రామంలో గల పటేల్ చెరువు లో బతుకమ్మ మెట్లు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేను కోరినట్లు వారు తెలిపారు. ఈ విషయంపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో నాగిరెడ్డిపేట్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాయమొల్లా సాయగౌడ్, యూత్ అధ్యక్షులు పల్లె రాజు, వైస్ ప్రెసిడెంట్ కిషన్, సెక్రటరీ గుమస్తా రమేష్, బీసీ సెల్ అధ్యక్షుడు మన్నే యాదగిరి, ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ అనంతి, సోషల్ మీడియా ఇన్ చార్జర్స్ మ్యాదరి ప్రవీణ్, మంగళి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేను కలిసిన కాంగ్రెస్ నాయకులు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES