Tuesday, August 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ -చౌటుప్పల్ రూరల్
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ఎప్పటికప్పుడు ఫోటోలు తీసీ బిల్లుల కోసం స్థానిక అధికారులకు పంపాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అధికారులను సూచించారు. సోమవారం చౌటుప్పల్ మండలంలోని స్వాములవారి లింగోటం గ్రామంలో లబ్ధిదారులు నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ హనుమంత రావు చౌటుప్పల్ మండలంలో ఆకస్మికంగా తనిఖీ చేసి ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం పనులు పరిశీలించారు.ఈ సందర్భంగా లబ్ధిదారులతో కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ ఇటుక సిమెంట్ స్టీల్,ఇసుక ధరలను అడిగి తెలుసుకున్నారు.

అదేవిధంగా వీటి ధరలు కట్టడి చేసేందుకు తగిన చర్యలు ప్రభుత్వ అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు.ఇంటి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని లబ్ధిదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ రెవెన్యూ డివిజనల్ అధికారి శేఖర్ రెడ్డి స్థానిక మండల అభివృద్ధి అధికారి బొజ్జ సందీప్ కుమార్ మండల పంచాయతీ అధికారి అంజిరెడ్డి గృహ నిర్మాణ శాఖ చౌటుప్పల్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగేశ్వర రావు ఏఈ రజియాఉద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -