నవతెలంగాణ-హైదరాబాద్: ఉక్రెయిన్ ప్రథమ మహిళ, అధ్యక్షుడు జెలెన్‌స్కీ సతీమణి ఒలెనా జెలెన్‌స్కీ జైపూర్‌లో ప్రత్యక్షమయ్యారు. జపాన్‌కు వెళ్తున్న తరుణంలో ఆమె ప్రయాణిస్తున్న విమానం జైపూర్‌లో ల్యాండ్ అయింది.
23 మంది ఉక్రెయిన్ సభ్యుల బృందం జపాన్ వెళ్తున్నారు. అయితే వారు ప్రయాణిస్తున్న విమానం.. ఇంధనం నింపుకునేందుకు ఉక్రెయిన్ విజ్ఞప్తి మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ముందస్తుగా ఆమోదం తెలిపింది. ఉక్రెయిన్ సభ్యులకు అవసరమైన ప్రోటోకాల్‌ను ఆమోదించాలని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీకి ఆదేశించింది. దీంతో విమానం ఉదయం 6:30 గంటలకు జైపూర్‌లో ల్యాండ్ అయింది. రెండు గంటల అనంతరం తిరిగి విమానం జపాన్‌కు బయల్దేరి వెళ్లింది.
రష్యాతో సుదీర్ఘ కాలంగా యుద్ధం జరుగుతోంది. అయితే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఆపేందుకు ఉక్రెయిన్ బృందం అంతర్జాతీయ పర్యటన చేపట్టింది. రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు జపాన్ పర్యటన చేపట్టింది. అంతేకాకుండా ఉక్రెయిన్ పునర్నిర్మాణంలో సహాయం కూడా చేయాలని జపాన్‌ను కోరనున్నారు. ఇక జపాన్, ఉక్రెయిన్‌తో భారత్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. 1992 నుంచి జపాన్‌తో భారత్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం ఆగాలంటూ భారత్ విజ్ఞప్తి చేసింది. అవసరమైతే దౌత్యం కూడా చేస్తామని మోడీ ప్రకటించారు.