Tuesday, August 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నాగల్ గావ్ పాఠశాల విద్యార్థులకు స్కూల్ కిట్ అందించిన వైద్య దంపతులు

నాగల్ గావ్ పాఠశాల విద్యార్థులకు స్కూల్ కిట్ అందించిన వైద్య దంపతులు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని నాగల్ గావ్ గ్రామానికి చెందిన గుండెవార్ సురేష్ దంపతులు, గ్రామస్తుల సహకారంతో స్వగ్రామంలోని ప్రభుత్వ ఎంపియుపిఎస్ పాఠశాల విద్యార్థులకు ప్రధానోపాధ్యాయుడు అశోక్ ఆధ్వర్యంలో టై , బెల్టు , మైక్ సెట్ , ఐడి కార్డులు విరాళంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా  మంగళవారం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైద్యుడు గుండె వార్ సురేష్ మాట్లాడుతూ.. తాను విద్యను ప్రభుత్వ పాఠశాలలో విద్యానభ్యసించానని తెలిపారు. సొంత గ్రామం కావడంతో తాను కూడా పేదరికం నుండి వైద్యవృత్తికి ఎంపికై నందుకు పాఠశాలకు తాను సొంతగా ఏమైనా చేయాలని ఉద్దేశంతో రూ.25వేలతో మైక్ సెట్ ను అందించానని అన్నారు.

అదేవిధంగా గ్రామస్తులు సహకరించడం వలన విద్యార్థులకు ప్రయివేట్ పాఠశాలలకు ధీటుగా పేద విద్యార్థులకు టైలు , బెల్ట్ లు , ఐడెంటి కార్డులు , 75 మంది విద్యార్థులకు గ్రామస్తుల ఆధ్వర్యంలో విద్యార్థులకు గ్రామ పెద్దలు ఉచితంగా అందజేయడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అశోక్, ఉపాధ్యాయులు బాలచంద్ర బృందం, గ్రామస్తులు బాబు పటేల్, మాజీ ఎంపీటీసీ అశోక్ పటేల్ , మాజీ సర్పంచ్ అనిల్ కుమార్ , పద్మశాలి వీరేశం, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -