Thursday, August 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బైండోవర్ ఉల్లంఘిస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తాం..!

బైండోవర్ ఉల్లంఘిస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తాం..!

- Advertisement -

– హుస్నాబాద్ ఎక్సైజ్  సీఐ పవన్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్

బైండోవర్ ఉల్లంఘనకు పాల్పడి గుడుంబా తయారీ చేసినా, అమ్మిన  పీ డీ యాక్ట్ నమోదు చేస్తామని హుస్నాబాద్ ఎక్సైజ్ సీఐ పవన్ హెచ్చరించారు. మంగళవారం ఎక్సైజ్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ  బెజ్జంకి మండలంలోని చీలపూర్పల్లి (వడ్డెర కాలనీ) కి చెందిన దండ్ల రేణుక గతంలో గుడుంబా కేసులో తహసీల్దారు ముందు బైండోవర్ చేసినప్పటికి  ఇటీవల మరల గుడుంబా తయారీ చేస్తూ పట్టుబడిందన్నారు. బైండోవర్ నిభందనలు ఉల్లంఘించినందుకు తహసీల్దార్  పంపరి చంద్రశేఖర్  ఆదేశానుసారం రూ.30 వేల జరిమానా విధించినట్లు హుస్నాబాద్ ఎక్సైజ్ సీ ఐ పవన్ తెలిపారు. గుడుంబా తయారు చేసిన అమ్మి నేరానికి పాల్పడితే ప్రభుత్వ లబ్ది పథకాలు నిలిపివేస్తామని తహసీల్దార్  చంద్రశేఖర్ తెలిపినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ లు రూప, దామోదర్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -