Wednesday, August 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మొండి బకాయిల వసూళ్లపై ప్రత్యేక శ్రద్ధ వహించండి: నిఖిల్ రెడ్డి 

మొండి బకాయిల వసూళ్లపై ప్రత్యేక శ్రద్ధ వహించండి: నిఖిల్ రెడ్డి 

- Advertisement -

నవతెలంగాణ- దుబ్బాక 
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు అభివృద్ధి బాట పట్టాలంటే పెండింగ్ లో ఉన్న మొండి బకాయిల వసూళ్లపై సొసైటీ డైరెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని నాబార్డ్ జిల్లా అభివృద్ధి మేనేజర్ (డీడీఎం) నిఖిల్ రెడ్డి అన్నారు. “అంతర్జాతీయ సహకార దినోత్సవం” సందర్భంగా మంగళవారం దుబ్బాకలోని పీఏసీఎస్ కార్యాలయంలో నాబార్డు ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు సంగారెడ్డి ఏజీఎం కే.చంద్రశేఖర్ రెడ్డి, దుబ్బాక పీఏసీఎస్ చైర్మన్ షేర్ల కైలాష్ తో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

సొసైటీలు ఆర్థికంగా వృద్ధి చెందితేనే బంకులు, గోదాములు వంటివి నిర్మించుకునేందుకు అవకాశం ఉంటుందని, అందుకు నాబార్డు సహకారం కూడా ఉంటుందని స్పష్టం చేశారు. లోన్లను సకాలంలో చెల్లించడం వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించాలన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో డీసీసీ బ్యాంకు మేనేజర్ ప్రవీణ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ కాల్వ నరేష్, డైరెక్టర్లు గజభీంకార్ బాలరాజు, గుండెల్లి ఎల్లారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, సీఈవో మోహన్, కరుణాకర్ పలువురు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -