Wednesday, August 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యూరియా నియంత్రణపై రైతుల్లో ఆందోళన

యూరియా నియంత్రణపై రైతుల్లో ఆందోళన

- Advertisement -

నవతెలంగాణ-బెజ్జంకి
రాష్ట్ర ప్రభుత్వం యూరియా వినియోగం తగ్గించడంతో పాటు వ్యవసాయేతర రంగాలు వినియోగించకుండా చర్యలు చేపట్టింది. రైతులు యూరియాను విచ్చలవిడిగా పంట పొలాల్లో వినియోగిస్తుండడంతో పలు సమస్యలేర్పడుతున్నాయి. దిగుబడి పెంచేందుకు ఉపయోగిస్తున్న యూరియా పంటల ఉత్పత్తులపై ప్రభావం చూపుతుంది. యూరియా వాడకం తగ్గించాలని అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నప్పటికీ పరిస్థితి మారడంలేదు. ఈ క్రమంలో ప్రభుత్వం మోతాదుకు మించి యూరియా వినియోగం తగ్గించేందుకు క్షేత్రస్థాయిలో చర్యలకు ఉపక్రమించింది. ఈ వానాకాలం సీజన్ నుంచి ఎకరాకు ఒకటే బస్తాను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు డీలర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఒకటి కన్నా ఎక్కువ బస్తాలు పంపిణీ చేస్తే డీలర్ల అనుమతులను రద్దు చేస్తామని హెచ్చరించింది. 

పర్యవేక్షణ కరువు..

యూరియా అమ్మకాలను పర్యవేక్షించే బాధ్యతను ప్రభుత్వన ఏడీఏలకు అప్పగించింది.ఏడీఏలు సంబంధిత ఏఓలతో కలిసి ఆయా డివిజన్లలోని ప్రాథమిక సహకార సంఘాలు,డీసీఎంఎస్,ఆగ్రోస్, సీఎస్సీ కేంద్రాలతోపాటు ప్రైవేట్ ఎరువుల దుకాణాలను వారంలో ఒక్కరోజైనా తనిఖీ చేయాలి. ఈ పాస్ యంత్రాలను పరిశీలించి ఎరువుల అమ్మకాల వివరాలు పరిశీలించాలి.ఇటీవల జిల్లా కలేక్టర్ ఆకస్మికంగా సందర్శించి మండల కేంద్రంలోని అగ్రోస్ రైతు సేవా కేంద్రంలో ఎరువుల నిల్వలు,రికార్డులను పరిశీలించారు.రికార్డులకు..ఎరువుల నిల్వకు వ్యత్యాసాన్ని గుర్తించారు.ఎరువుల నిల్వలపై నివేదిక అందించాలని కలేక్టర్ ఏడీఏను అధేశించారు.

రైతుల బారులు..

ఎకరాకు ఒకటే బస్తా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.దీంతో రైతులు మంగళవారం మండల కేంద్రంలోని సీఎస్సీ ఎరువుల కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు బారులుతీరి పాట్లుపడ్డారు.

పక్కదారి పట్టకుండా ఉండేందుకే..

యూరియా వ్యవసాయేతర రంగాలకు తరలకుండా ఉండేందుకు ప్రభుత్వం కొత్త విధానం అమలు చేస్తు న్నట్లు వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. రైతులు పంటల దిగుబడి పెంచేందుకు యూరియాను వినియోగిస్తుండగా అక్రమార్కులు వ్యవసాయేతర రంగాలకు ఉపయోగిస్తున్నారు.కొంతమంది దళారులు రైతులు పేరిట యూరియాను పెద్దమొత్తంలో సేకరించి బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఎకరాకు ఒకటే బస్తా ఇవ్వాలనే కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది.ప్రభుత్వ నిర్ణయంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.ఎకరానికి ఒక బస్తా సరిపోదని..కనీసం రెండు ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -