Wednesday, August 6, 2025
E-PAPER
Homeక్రైమ్రైలు ఢీకొని మహిళ మృతి 

రైలు ఢీకొని మహిళ మృతి 

- Advertisement -

నవతెలంగాణ – వలిగొండ రూరల్
మండలంలోని ఏదుళ్లగూడెం రైల్వే వంతెన సమీపంలో ప్రమాద వశాత్తు రైలుఢీకొని మహిళ మృతిచెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి మండలంలోని తాజ్ పూర్ కు  చెందిన గుళ్ళని పోచమ్మ (90) అను మహిళ వారి స్వగ్రామం నుండి ఏదుళ్లగూడెం బంధువుల ఇంటికి వస్తుండగా అండర్ పాస్ పైనుండి రైల్వే పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలిసిన రైల్వే పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టరం నిమిత్తం మృతదేహాన్ని భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్సై రామకృష్ణ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -