- Advertisement -
నవతెలంగాణ – మాక్లూ ర్
మండలంలోని దర్మొర గ్రామానికి చెందిన అరుణ్ (28) ఒంటికి నిప్పు అంటించుకుని చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం ఈ నెల 3వ తేదిన రాత్రి కుటుంబ కలహాలతో ఒంటిపై పెట్రోల్ పోసుకొని అరుణ్ నిప్పంటించుకున్నడు. స్థానికులు, కుటుంబీకులు గమనించి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. అక్కడ మంగళవారం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.
- Advertisement -