నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
స్కాలర్షిప్ రాక అంధకారంలో విద్యార్థుల భవిష్యత్తు, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్ విడుదల చేసి ఉన్నత విద్యను బలోపేతం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియ రాజు అన్నారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరిలో యూనిటీ ఫార్మసీ కళాశాలలో ఎస్ఎఫ్ఐ స్వాగత సభ జిల్లా కమిటీ సభ్యుడు బుగ్గ ఉదయ్ అధ్యక్షతన నిర్వహించగా , ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
గత ఆరు సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి 8300 వేల కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని, గత 10 సంవత్సరాల పాలించిన టిఆర్ఎస్ ప్రభుత్వం స్కాలర్షిప్లో విడుదల చేయకుండా కాలయాపన చేసిందని అన్నారు . నూతనంగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో చెప్పి అధికారంలో వచ్చిన తర్వాత ఉన్నత విద్యను సంక్షేమంలో నెట్టే పరిస్థితి తెచ్చిందని ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చి 20 నెలలు గడుస్తున్నా గాని స్కాలర్షిప్ విడుదల చేయకుండా కాలయాపన చేస్తా ఉన్నది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందనీ , ప్రభుత్వం తన ఎన్నికల హామీలు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
స్కాలర్షిప్ విడుదల చేయకుంటే ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని, ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని లేనియెడల రానున్న రోజుల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ప్రతి గ్రామంలో ఎస్ఎఫ్ఐ కార్యకర్త తిరిగి తన ప్రభుత్వం ఓటమిని ప్రభుత్వం ఇచ్చిన వాగ్వాదాన్ని ప్రజల వైపు తీసుకెళ్లి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తామన డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు బుగ్గ ఉదయ్ , విద్యార్థులు శ్రావణ్, శివాని, భరత్ , విష్ణు లు పాల్గొన్నారు.