Wednesday, August 6, 2025
E-PAPER
Homeమానవిఇలా అధిగమిద్దాం...

ఇలా అధిగమిద్దాం…

- Advertisement -

విటమిన్‌ డి లోపం మానసిక, శారీరక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇది సూర్యరశ్మి, గుడ్లు, మొక్కలు, చేపలు, మాంసం మొదలైన వాటి నుంచి లభిస్తుంది. అయితే వివిధ కారణాల వల్ల డి విటమిన్‌ లోపం కేసులు ఇటీవల పెరుగుతున్నాయి. ఇంట్లో కూర్చోవడం, ఎక్కువగా సన్‌స్క్రీన్‌ రాయటం, ఇవన్నీ విటమిన్‌ డి లోపానికి కారణాలు. ఎముక ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేసే కాల్షియం తయారీతో సహా వివిధ విధులను నిర్వహించడానికి శరీరానికి డి విటమిన్‌ అవసరం. తరుచుగా అలసటకు గురవటం, అనారోగ్య సంబంధ సమస్యలు చుట్టుముడుతుంటే పరీక్షల ద్వారా డి విటమిన్‌ లోపమేమైనా ఉంటే తెలుసుకోవాలి.
విటమిన్‌ డి లోపం ఉన్నట్లు నిర్ధారణ అయితే.. తగినంత సూర్యరశ్మిని పొందటం ద్వారా తిరిగి ఆ లోటును భర్తీ చేయవచ్చు. విటమిన్‌ డి కి ప్రధాన మూలం సూర్యుడు. మాన శరీరానికి సూర్యరశ్మి తగిలినప్పుడు సంశ్లేషణ చెంది విటమిన్‌ డి అందుతుంది. ఇంటి లోపల ఎక్కువ సమయం ఉండటంవల్ల చాలా మంది విటమిన్‌ డి లోపం ముప్పును ఎదుర్కొంటున్నారు.
కొందరు ఏసీ రూమ్‌ల్లో ఎక్కువగా కూర్చుంటుంటారు. అలాంటి వారికి సూర్యరశ్మి తగలదు. అలాంటి వారిలో విటమిన్‌ డి స్థాయిలు తక్కువగా ఉంటాయి. చర్మాన్ని టానింగ్‌ నుండి రక్షించడానికి సన్‌స్క్రీన్‌ లోషన్‌ రాసుకోవటమూ సూర్యుడి నుండి డి విటమిన్‌ సరిగా అందకపోవడానికి మరొక కారణమని నిపుణులు చెబుతున్నారు. విటమిన్‌ డి కొవ్వులో కరిగే విటమిన్‌ అయినందున శరీరంలో శోషణకు గురికాదు. కొవ్వును నివారించడం వల్ల విటమిన్‌ డి లోపం తలెత్తుతుంది. గర్భిణులకు దీని లోపం ఉండే పుట్టిన పిల్లల్లో ఎముకల పెరుగుదల, జీవక్రియ లోపాలు తలెత్తుతాయి.
పిల్లల్లో రికెట్స్‌, పెద్దల్లో ఆస్టియోమలాసియా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రెండు సమస్యలు వల్ల కాల్షియం లోపం ఏర్పడి ఎముకలను పెళుసుగా చేస్తుంది. అలసట, రోగనిరోధక వ్యవస్థ బలహీనం కావటం వంటివి చోటు చేసుకుంటాయి. డిప్రెషన్‌, విటమిన్‌ డి లోపం మధ్య సంబంధం ఉన్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది. అదే క్రమంలో విటమిన్‌ డి అధికంగా తీసుకోవడం కూడా అంతే ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
జీవనశైలి మార్పులు
విటమిన్‌ డి మూడు రూపాల్లో లభిస్తుంది. ఒకటి ఆహారం, రెండు సూర్యకాంతి ద్వారా లభిస్తుంది. ఆహార వనరులలో బలవర్థకమైన పాలు, తణధాన్యాలు, గుడ్డు, కొవ్వు చేపలు, లివర్‌ మొదలైనవి ఉన్నాయి.
విటమిన్‌ డి మంచి మోతాదులో పొందాలంటే ఉదయం పూట సుమారు 10-15 నిమిషాల పాటు సూర్యరశ్మిలో ఉండటం మంచిది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -