Thursday, August 7, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఫ్రాన్స్‌లో కార్చిచ్చు

ఫ్రాన్స్‌లో కార్చిచ్చు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: కార్చిచ్చు యూర‌ప్ దేశాల్లో అల‌జ‌డి సృష్టించింది. గిఫోర్టు అనే కార్చిచ్చు శ‌ర‌వేగంగా విస్త‌రిస్తూ యూఎస్‌ను బెంబేలెత్తిస్తుంది. తాజాగాదక్షిణ ఫ్రాన్స్‌లోని స్పానిష్ సరిహద్దుకు సమీపంలోని ఆడ్ ప్రాంతంలో జరిగిన కార్చిచ్చు దాదాపు 4,500 హెక్టార్ల (11,100 ఎకరాలు) అడవిని దగ్ధం చేసిందని మంగళవారం ఆలస్యంగా అగ్నిమాపక దళం తెలిపింది. వందలాది మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 1,250 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారని పౌర రక్షణ సంస్థ ప్రతినిధి కల్నల్ అలెగ్జాండర్ జౌసార్డ్ మీడియాకి తెలిపారు.

ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఎక్స్ లో ఈ ఘటనపై స్పందించారు. మంటలు పెరుగుతున్నాయని, అదుపు చేసేందుకు దేశంలోని అన్ని వనరులను సమీకరించామని ఆయన తెలిపారు. ఇద్దరు వ్యక్తులు మంటల్లో గాయపడ్డారు. వారిలో ఒకరి ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా ఉఉందని ఆడ్ డిప్యూటీ ప్రిఫెక్ట్ లూసీ రోసెచ్ మీడియాకి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -