నవతెలంగాణ-హైదరాబాద్: బాంబే హైకోర్టు జడ్జీగా బీజేపీ అధికార ప్రతినిధిగా పనిచేసిన లాయర్ ఆర్తీ సాథేను నియమించడం పట్ల కాంగ్రెస్, ఎన్సీపీ (ఎస్పీ) నేతలు అభ్యంతరం తెలిపారు. మహారాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధిగా ఆమె పనిచేసిన నేపథ్యంలో, ఆమెను జడ్జీగా నియమించడంమ వల్ల న్యాయవ్యవస్థ నిష్పాక్షితపై ప్రభావం చూపుతుందని వారు పేర్కొన్నారు.
‘బీజేపీ అధికార ప్రతినిధిగా పనిచేసిన వ్యక్తి న్యాయమూర్తి అయితే, ప్రజలకు న్యాయం జరుగుతుందా? రాజ్యాంగ పరిరక్షణ జరుగుతుందా?’ అని సీఎల్పీ నేత విజయ్ వాడెట్టివర్ ప్రశ్నించారు. ఆమె పదోన్నతి న్యాయవ్యవస్థ నిష్పాక్షితపై ప్రభావం చూపుతుందని ఎన్సీపీ (ఎస్పీ) ఎంఎల్‌ఏ రోహిత్ పవార్ పేర్కొన్నారు. కాగా, విపక్షాల విమర్శలను అర్థం లేనివిగా పేర్కొన్న బీజేపీ చీఫ్ కేశవ్ ఉపాధ్యాయ్.. ఆమె గత ఏడాదే పార్టీకి రాజీనామా చేశారని తెలిపారు.