అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు, క్రిష్ జాగర్లమూడి కాంబోలో రూపొందుతున్న యాక్షన్ డ్రామా చిత్రం ‘ఘాటీ’. సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదలకు కానున్నట్లు మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. గ్రిప్పింగ్ థియేట్రికల్ ట్రైలర్ ద్వారా రిలీజ్ డేట్‌ని రివీల్ చేశారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లముడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యువి క్రియేషన్స్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
‘బ్రిటీష్ కాలంలో ప్రమాదకరమైన కనుమలలో చారిత్రాత్మకంగా రోడ్లు నిర్మించిన ఘాటి ప్రపంచాన్ని పరిచయం చేసే పవర్ ఫుల్ వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఇప్పుడు వారు కొండల్లో డ్రగ్స్ మోసే పనుల్లో చిక్కుకుపోయారు. ఈ కఠినమైన పరిస్థితులు చిక్కుకున్న ప్రేమికుల జంటగా అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు కనిపించారు. అనుష్క పాత్ర అవినీతి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతుంది. తప్పు చేస్తున్నామనే గ్రహించి, ఈ చెడు వ్యవస్థకి ఎదురు నిలవడానికి రెడీ అవుతుంది. తన వాళ్లని ఈ ప్రమాదకర వ్యాపారం నుంచి బయటకు లాగడానికి ప్రయత్నిస్తుంది. ట్రైలర్‌లో అనుష్కను మునుపెప్పుడూ చూడని వైల్డ్ అవతార్‌లో కనిపించారు. ఒక బలహీన మహిళ నుంచి క్రిమినల్, అక్కడి నుంచి లెజెండ్‌గా మారే ఆమె పాత్ర ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. ఆమె అద్భుతమైన పర్ఫార్మెన్స్‌తో పాత్రకి ప్రాణం పోస్తుంది. విక్రమ్ ప్రభు పర్ఫార్మెన్స్ స్ట్రాంగ్‌గా ఉంది. చైతన్య రావు, రవీంద్రన్ విజరు విలన్ పాత్రల్లో ఆకట్టుకున్నారు. జగపతి బాబు ప్రజెన్స్ మరింత క్యురియాసిటీ పెంచింది. దర్శకుడు క్రిష్ జాగర్లముడి ఒక ప్రత్యేకమైన, బోల్డ్ కథను తెరపైకి తెచ్చారు. ఎమోషన్, యాక్షన్‌తో కథ అద్భుతంగా నడిపించారు’ అని చిత్ర యూనిట్ తెలిపింది.
‘ఘాటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES