20 శాతం పెంపుదల చేస్తున్నట్టు ప్రకటన
న్యూయార్క్: టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ నిర్వాహకులు ఆటగాళ్లకు అందజేసే ప్రైజ్ మనీని పెంపుదల చేస్తున్నారు. ఈ ఏడాది నుంచి గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఆటగాళ్లకు అందజేసే ప్రైజ్ మనీని పెంపుదల చేయాలని కోరుతూ స్టార్ ఆటగాళ్లు జకోవిచ్, కోకో గాఫ్, సబలెంక, సిన్నర్ తదితరులు లేఖలు పంపిన క్రమంలో టోర్నీ నిర్వాహకులు ప్రైజ్ మనీని పెంపుదల చేస్తున్నట్లు సమాచారం. 2025లో వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ నిర్వాహకులు ఆటగాళ్లకు అందజేసిన ప్రైజ్ మనీని పెంపుదల చేయగా.. తాజాగా యుఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ నిర్వాహకులు కూడా 20శాతం ప్రైజ్‌మనీని పెంపుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు యుఎస్ టెన్నిస్ అసోసియేషన్ బుధవారం ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. యుఎస్ ఓపెన్‌లో ఆటగాళ్లందదరూ కలిపి భారత కరెన్సీలో సుమారు 746కోట్ల రూపాయలు (85 మిలియన్ డాలర్లు) ప్రైజ్‌మనీ అందుకోనున్నారు. సింగిల్ విజేత 5 మిలయన్ డాలర్ల ప్రైజ్ మనీ అందుకోనుండగా.. గత ఏడాదితో పోల్చిచూస్తే టోర్నీ నిర్వాహకులు ఆటగాళ్లకు అందజేసే ప్రైజ్ మనీని 20 శాతం నుంచి 90శాతం మిలియన్ డాలర్లకు పెంచుతున్నట్లు తాజాగా తెలిపారు. నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీలలోకెల్లా ఇదే అత్యధిక పారితోషికం కావడం విశేషం. 2024లో 75మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ అందజేయగా.. ఈసారి అది 90మిలియన్ డాలర్లకు చేరింది. ఆగస్టు 19, 20 తేదీల్లో కొత్త మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్ ప్రారంభం కానున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
యుఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ ప్రైజ్ మనీ పెంపు
- Advertisement -
- Advertisement -