– ఏకంగా 12స్థానాలు మెరుగుపర్చుకొని 15వ ర్యాంక్
– ప్రసిధ్‌కూ కెరీర్ బెస్ట్ ర్యాంక్ ొఐసిసి టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) ప్రకటించిన తాజా టెస్ట్ ర్యాంకింగ్స్‌లో మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ సత్తా చాటారు. ఐసిసి బుధవారం ప్రకటించిన టెస్ట్ బౌలర్ల జాబితాలో వీరు కెరీర్ బెస్ట్ ర్యాంకుల్లో నిలిచారు. ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో 23వికెట్లు తీసిన మహ్మద్ సిరాజ్ ఏకంగా 12స్థానాలు ఎగబాకి 15వ స్థానం నిలిచాడు. దీంతో సిరాజ్ 674రేటింగ్ పాయింట్లు ఆ స్థానంలో ఉన్నాడు. ఇక ప్రసిధ్ కృష్ణ ఏకంగా 25స్థానాలు మెరుగుపరుచుకొని 59వ స్థానంలో నిలిచాడు. అతని ఖాతాలో 368 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఐదో, చివరి టెస్ట్‌లో ఎనిమిది వికెట్లు తీసిన ప్రసిధ్ కెరీర్ బెస్ట్ ర్యాంక్ ఇదే. టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా 889 రేటింగ్ పాయింట్ల అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. బ్యాటర్ల జాబితాలో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ బ్యాటర్ల జాబితాలో టాప్-5లో చోటు దక్కించుకున్నాడు. జైస్వాల్ 792రేటింగ్ పాయింట్లతో ఏకంగా మూడోస్థానంలో నిలువగా.. రూట్, బ్రూక్ టాప్-2లో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో రిషబ్ పంత్ టాప్-10లో చోటు దక్కించుకొన్నాడు. తాజా టెస్ట్ బ్యాటర్ల జాబితాలో రిషబ్ పంత్ ఎనిమిదో స్థానంలో నిలిచాడు. ఐదో, చివరి టెస్ట్‌లో గాయం కారణంగా బెంచ్‌కే పరిమితం కావడంతో అతడు 8వ స్థానంలో నిలిచాడు.
ఆసియాకప్‌కు జట్టు ఎంపికపై సెలెక్టర్లు మల్లగుల్లాలు
ఇంగ్లండ్ పర్యటనలో యువ క్రికెటర్లు అద్భుత ప్రదర్శన కనబర్చడంతో ఆసియాకప్‌కు జట్టు తలనొప్పిగా మారింది. ఇంగ్లండ్ నుంచి భారత ఆటగాళ్లంతా స్వదేశానికి తిరుగు ముఖం పట్టారు. శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా అద్భుతంగా రాణించింది. దీంతో భారత జట్టు ఆసియా కప్‌కు ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ మొదలు కానుంది. ఈ టోర్నీ టి20 ఫార్మాట్‌లో జరగనున్న దృష్ట్యా జట్టును ఎంపిక చేసేందుకు సెలక్షన్ కమిటీకి పెద్ద సవాల్‌గా మారింది. టి20 జట్టు ఇటీవల కాలంలో నిలకడగా రాణిస్తోంది. ఈ ఫార్మాట్‌కు టీమిండియా కెప్టెన్‌గా సూర్య కుమార్ యాదవ్ వ్యవహరిస్తున్నాడు. ఆగస్టు మూడోవారంలోపు ఆసియా కప్ కోసం బిసిసిఐ జట్టును ప్రకటించాల్సి ఉంది. ఈ క్రమంలో జట్టులో చోటు కోసం జైస్వాల్, గిల్, సాయి సుదర్శన్ రేసులో ఉన్నారు. ఈ సిరీస్ ముగిసిన తర్వాత భారతజట్టు వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగే టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. అక్టోబర్ 2 నుంచి అహ్మదాబాద్‌లో భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఐపిఎల్ చివరి సీజన్‌లో యశస్వి మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఐపిఎల్‌లో జైస్వాల్ 160 స్ట్రయిక్ రేట్‌తో 559 పరుగులు, గిల్ 15మ్యాచుల్లో 650 పరుగులు చేశాడు. ఇక సాయి సుదర్శన్ 156 స్ట్రయిక్ రేట్‌తో 759 పరుగులు చేసి సీజన్-18 ఐపిఎల్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో ఈ ముగ్గురికి ఆసియాకప్ జట్టులో చోటు కల్పిస్తారా? లేదా? అనే ఉత్కంఠ నెలకొంది. ఆసియా కప్‌లో ఆడే ప్లేయర్స్ అంతా ఫైనల్ వరకు 21 రోజులు అందుబాటులో ఉండాల్సి ఉంటుంది. ఆసియా కప్ కోసం 17మంది సభ్యులతో జట్టును ఎంపిక చేయనుండగా.. ప్రస్తుతం ఉన్న ఆప్షన్స్‌ను సెలెక్టర్లు జాగ్రత్తగా పరిశీలించన్నట్లు బిసిసిఐ అధికారి ఒకరు తెలిపారు. ఇక బౌలింగ్ విభాగం ఎంపిక కూడా సెలెక్టర్లకు ఇబ్బందికరంగా మారనుంది. కీలక టోర్నీకి ఫాస్ట్ బౌలర్లు జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌ను ఎంపిక చేస్తారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఆసియా కప్ తర్వాత వెంటనే వెస్టిండిస్‌తో సిరీస్ నేపథ్యంలో వీరి విషయంలో సెలెక్టర్లు జాగ్రత్తలు తీసుకునే అవకాశాలున్నాయి. అదే సమయంలో సెలక్షన్ కమిటీ సమావేశానికి ముందు ఫిట్‌నెస్‌ను సైతం అంచనా వేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆసియాకప్-2025 యుఎఇ వేదికగా సెప్టెంబర్ 9నుంచి జరగనున్న సంగతి తెలిసిందే.
ర్యాంకింగ్స్‌లోనూ సత్తా చాటిన సిరాజ్
- Advertisement -
- Advertisement -