మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని దివాళా తీయించారు
ఆంధ్రా పెట్టుబడిదారులు దోచుకున్నారు
వారి బండారం బయటపెడతా
సీఎం రేవంత్‌రెడ్డి తన భాష మార్చుకోవాలి
ఏఐసీసీ తనకు మంత్రి హామీ ఇచ్చింది
కాళేశ్వరం అవినీతిపై సీఎం ఇంకా చర్యలు తీసుకోలేదు : ఇష్టాగోష్టిలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బీఆర్‌ఎస్ నేతలు అధికారం కోల్పోయామనే ఫ్రస్టేషన్‌లో ఉన్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. అసెంబ్లీకి రాని కేసీఆర్‌కు ప్రతిపక్ష నేతగా కొనసాగే అర్హత లేదని తెలిపారు. ‘ఆయన అసెంబ్లీ కన్నా రావాలి. ప్రతిపక్ష నేత పదవికైనా రాజీనామా చేయాలి’ అని డిమాండ్ చేశారు. గత పదేండ్లపాటు కేసీఆర్ కుటుంబంతోపాటు ఆంధ్రా పెట్టుబడిదారుల మాఫియా కాంట్రాక్టుల పేరిట లక్షల కోట్లు దోచుకుని ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన మాట వాస్తవమేనన్నారు. మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక దివాళా తీయించారని విమర్శించారు. బుధవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో డిజిటల్ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిలో రాజగోపాల్‌రెడ్డి మాట్లాడారు. రాష్ట్రాన్ని 20 మంది ఆంధ్రా ప్రాంతానికి చెందిన పెట్టుబడిదారులు ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నారని విమర్శించారు. సమయం వచ్చినప్పుడు వారి బండారం బయట పెడతానని తెలిపారు. తెలంగాణ సంపద దోపిడీ చేస్తూ…ఈ ప్రాంతానికి ఎవరు అన్యాయం చేసినా బహిరంగంగా మాట్లాడుతానని చెప్పారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోపిడీ చేస్తమంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. పదవుల కోసం దిగజారి ప్రవర్తించేది లేదని చెప్పారు. ప్రజల కోసం ఎటువంటి త్యాగమైనా సిద్ధం స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి తన భాష మార్చుకోవాలని సూచించారు. ఇంకా మూడున్నరేండ్లు ప్రభుత్వం ఉంటుందనీ, ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డే ఉంటారని తెలిపారు. ఆ తర్వాత సీఎం స్థానంలో ఎవరుంటరేనేది ఎన్నికల తర్వాత తెలుస్తుందన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికపై అసెంబ్లీలో చర్చించి తగిన చర్యలు తీసుకోవాలని సీఎంను కోరారు. ఇప్పటికైనా మాటలు తక్కువ చేసి లక్షల కోట్ల దోపిడీకి పాల్పడిన వారిని అరెస్టు చేసి జైల్లో పెట్టాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. వీలైనంత త్వరగా ఖాళీగా ఉన్న మంత్రి పదవులను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించానలి సూచించారు. 20 నెలలుగా గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. ఓడ దాటేంత వరకు ఓడ మల్లయ్య, ఒడ్డుకు చేరిన తర్వాత బోడ మల్లయ్య అన్నట్టు డిజిటల్ మీడియానుద్దేశించి సీఎం కామెంట్ చేశార ని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా డిజిటల్ మీడియా చేసిన కృషిని ఆయన గుర్తు చేశారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి డిజిటల్ మీడియాను ఉద్దేశించి చులకనగా, అవమా నకరంగా మాట్లాడితే బాధనిపించి మంచి పద్ధతి కాదని ఎక్స్‌లో పేర్కొన్నట్టు ఆయన తెలిపారు.
అసెంబ్లీకి రాని కేసీఆర్‌కుప్రతిపక్ష నేత పదవి ఎందుకు?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES