Thursday, August 7, 2025
E-PAPER
spot_img
Homeట్రెండింగ్ న్యూస్చిత్ర ప‌రిశ్ర‌మ‌లో తీవ్ర విషాదం..యువ న‌టుడు క‌న్నుమూత‌

చిత్ర ప‌రిశ్ర‌మ‌లో తీవ్ర విషాదం..యువ న‌టుడు క‌న్నుమూత‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : చిత్ర ప‌రిశ్ర‌మ‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కన్నడ యువ నటుడు సంతోష్ బాలరాజ్ కన్నుమూశాడు. 35ఏళ్ల వయసులోనే తుది శ్వాస విడిచాడు. కాగా జాండీస్ కారణంగా వచ్చిన హెల్త్ ఇష్యూస్‌తో కొన్ని వారాలుగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని.. కానీ తీవ్ర అస్వస్థతతో హాస్పిటల్‌లో చేరిన ఆయన.. కోమాలోకి వెళ్లిపోయాడని తెలుస్తోంది. ఆగస్టు 5న వైద్యులు ఆయన మరణాన్ని ధృవీకరించారు. నిర్మాత అనెకల్ బాలరాజ్ కుమారుడైన సంతోష్ బాలరాజ్.. ఇంటెన్స్ రోల్స్ చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ‘గనప’, ‘కరియ 2’ ఆయన కెరీర్‌లో బెస్ట్ సినిమాలు కాగా ఇండస్ట్రీ ప్రముఖులు, అభిమానులు ఆయన మృతిపై ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img