నవతెలంగాణ – అచ్చంపేట
అచ్చంపేట మండలంలో నడుస్తున్న జీవీకే ఈఎంఆర్ఐ 108 అంబులెన్స్ ను నాగర్ కర్నూలు జిల్లా మేనేజర్ బి. శ్రీను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంబులెన్స్ లోని వివిధ రకాల పరికరాలు వాటి పనితీరు అడిగి తెలుసుకున్నారు.మందుల రికార్డులను పరిశీలించారు. అంబులెన్స్ లో ఏదైనా పరికరాలు పని చేయకపోతే వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి అంబులెన్స్ లో ఉండేటట్లు సరిచూసుకోవాలని సిబ్బందికి సూచించారు.
కేసు వచ్చిన తక్షణమే 108 అంబులెన్సులు సంబంధిత ప్రదేశానికి చేరుకొని క్షతగాత్రులను దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాలన్నారు. అంబులెన్స్ సిబ్బంది ఎప్పుడూ అందుబాటులో ఉండాలని, నాణ్యమైన వైద్యాన్ని అందించాలన్నారు. ఆ సమయంలో అంబులెన్స్ సిబ్బంది ఆంజనేయులు, కిరణ్ కుమార్ ఉన్నారు.