Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుగ్రామ గ్రామాన గులాబీ జెండా ఎగరాలే...!

గ్రామ గ్రామాన గులాబీ జెండా ఎగరాలే…!

- Advertisement -
  • సమస్య ఉంటే ఫోన్ చేయండి అండగా ఉంటా..!
    క్యాడర్ లో జోష్ నింపుతున్న మాజీ ఎమ్మెల్యే  సతీష్ కుమార్ 
  • నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
  • గ్రామ గ్రామానా గులాబీ జెండా ఎగిరేల ప్రతి ఒక్క బీఆర్ ఎస్ పార్టీ నాయకులు బాధ్యత తీసుకోవాలని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్ అన్నారు. గురువారం హుస్నాబాద్ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సైదాపూర్ మండల  బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న గులాబీ పార్టీ క్యాడర్ లో మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ జోస్ నింపుతున్నారు.

    ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలే నా బలం నా బలగమని ఏ సమస్య వచ్చినా నాకు ఓక ఫోన్ కాల్ చేస్తే అండగా వుంటానన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మన పార్టీ విజయం దిశగా అందరు పని చేయాలని తెలిపారు. ఈ మోసపూరిత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు చేయడంలో  ఫెయిల్ అయిందన్నారు. మనం చేసిన అభివృద్ధిని ప్రజల వద్దకి తీసుకెళ్లి వారికీ నిజాలు తెలియజేసే బాధ్యత ప్రతీ ఒక్కరు తీసుకోవాలన్నారు. కష్టపడే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. రైతులకు సాగునీరు అందించి వారి కుటుంబాల్లో సంతోషాన్ని నింపింది మన కేసీఆర్ అన్నారు. ఈకార్యక్రమంలో సైదాపూర్ మండల ముఖ్య నాయకులు .మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img