బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ‘కిష్కిందపురి’లో నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి రచన, దర్శకత్వం వహిస్తున్నారు. అర్చన ప్రజెంట్ చేస్తున్నారు. ఈ హర్రర్, మిస్టరీ థ్రిల్లర్‌లో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించింది. తాజాగా మేకర్స్ ఫస్ట్ సింగిల్ ‘ఉండిపోవే నాతోనే..’ని లాంచ్ చేశారు. బుధవారం లాంచ్ చేసిన ఈ పాటతో మ్యూజిక్ ప్రమోషన్స్‌కి శ్రీకారం చుట్టి, ఆడియన్స్‌లో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. చైతన్ భరద్వాజ్ స్వరపరిచిన ఈ పాటలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ అద్భుతమైన కెమిస్ట్రీతో ఆకట్టుకున్నారు. జావేద్ అలీ వోకల్స్ మెస్మరైజ్ చేశాయి. ప్రేమలో ఉన్న భావోద్వేగాలను పూర్ణా చారి సాహిత్యం ద్వారా మరింత అందంగా ప్రజెంట్ చేశారు. బ్యూటీఫుల్ బీచ్‌సైడ్ విజువల్స్ చాలా ప్లజెంట్‌గా ఉన్నాయి. టీజర్‌లో ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళిన దర్శకుడు కౌశిక్ పెగల్లపాటి ఈ సాంగ్‌తో ఒక రొమాంటిక్ టచ్ ఇచ్చాడు. రాజు సుందరం కొరియోగ్రఫీ సాంగ్ వైబ్‌ను మరింతగా పెంచింది. సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ, ‘చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ నచ్చే సినిమా ఇది. మంచి హర్రర్ మిస్టరీ. మీరందరు సినిమా చూసి, మా టీమ్ అందరినీ బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
‘ఇది చాలా స్పెషల్ సినిమా. ఇందులో చాలా స్పెషల్ మూమెంట్స్ ఉంటాయి. త్వరలోనే సినిమా రిలీజ్ అవుతుంది. కచ్చితంగా మీరందరూ ఈ సినిమాని థియేటర్స్‌లో చూసి ఎంజారు చేయాలి’ అని హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ చెప్పారు. దర్శకుడు కౌశిక్ పెగల్లపాటి మాట్లాడుతూ,’నేను చదువుకున్న కాలేజీలో ఈ సాంగ్‌ని లాంచ్ చేేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సాంగ్ మీ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది’ అని తెలిపారు. ‘మీ అందరి ముందు ఈ సాంగ్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ పాట మీ అందరికీ నచ్చితే పదిమందికి షేర్ చేయండి. చాలా మంచి సబ్జెక్టు ఇది’ అని సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ చెప్పారు.