- Advertisement -
న్యూఢిల్లీ : రష్యా అధ్యక్షుడు వ్లాదమిర్ పుతిన్ భారత్ పర్యటన ఖరారైనట్టు సమాచారం. త్వరలో ఆయన భారత్ పర్యటన జరగనుందని తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ వెల్లడించారు. పుతిన్ పర్యటన తేదీలు ఖరారు చేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం రష్యా పర్యటనలో ఉన్న ధోవల్, రష్యా భద్రతామండలి సెక్రెటరీ సెర్గీ షోయిగుతో సమావేశమైన అనంతరం ఈ ప్రకటన చేశారు.
- Advertisement -