– జిల్లా క్యాడర్‌కు పదోన్నతులు కల్పించాలి : టీవీవీపీ కమిషనర్‌కు టీయుఎంహెచ్‌ఇయూ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) పరిధిలో పని చేస్తున్న ఉద్యోగులకు వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (టీయుఎంహెచ్ ఇయూ- సీఐటీయూ అనుబంధం) డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం ఆ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.యాదనాయక్, వైద్య విధాన పరిషత్ విభాగం కార్యదర్శి బి.శ్రీనివాస్‌తో పాటు ఎం.కిషన్ నాయక్, భూలక్ష్మి, జె.సుధాకర్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. టీవీవీపీ పరిధిలో రెగ్యులర్, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పని చేసే ఉద్యోగులున్నారని తెలిపారు. వారిలో రెగ్యులర్ ఉద్యోగులకు ఈ నెల 7 వరకు, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు రెండు నెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. సెక్యూరిటీ, శానిటేషన్, పేషెంట్ కేర్ ఉద్యోగులకు మూడు నెలల నుంచి వేతనాలు పెండింగ్ ఉన్నాయని తెలిపారు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనీ, కుటుంబ పోషణ భారంగా మారిందని వారు చెప్పారు. అంతేకాక వరుసగా వస్తున్న పండుగలను దృష్టిలో పెట్టుకుని వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించి ఆదుకోవాలని కోరారు. వివిధ జిల్లాల్లో పని చేస్తున్న జిల్లా క్యాడర్ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించే విధంగా జిల్లా ఆస్పత్రుల సూపరింటెండెంట్లకు ఆదేశాలు ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు.
పెండింగ్ వేతనాలు చెల్లించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES