– బాలుడి నిర్బంధంపై ఆగ్రహం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బాలుడి అక్రమ నిర్బంధం, థర్డ్ డిగ్రీ ప్రయోగం కేసులో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌పై తెలంగాణ మానవహక్కుల కమిషన్ చైర్మెన్ జస్టిస్ షమీమ్ అక్తర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన 17 ఏండ్ల కుమారుడు దగ్గుపాటి అజ్తి కుమార్ శర్మను 2024 డిసెంబర్ 15 నుంచి 2024 డిసెంబర్ 17 వరకు జూబ్లీహిల్స్ పోలీసులు అక్రమంగా నిర్బంధించి, హింసించారని హైదరాబాద్‌కు చెందిన దగ్గుబాటి రాంబాబు కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. దాంతో కమిషన్ జూబ్లీహిల్స్ పోలీసులపై( హెచ్‌ఆర్సీ 2901/2025) కేసు నమోదు చేసింది. ఫిర్యాదుదారుడు చేసిన ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన కమిషన్ పోలీసుల హింస కారణంగా బాధితుడు నడవలేని స్థితిలో ఉన్నట్టు పేర్కొంది. సిటీ పోలీస్ కమిషనర్ ఈ నెల 12న వ్యక్తిగతంగా హాజరై కేసుకు సంబంధించి అన్ని రికార్డులు సమర్పించాలని ఆదేశించింది. హైదరాబాద్‌లోని నిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ బాధితుడిని పరిశీలించి అవసరమైన చికిత్స అందించడంతో పాటు 48 గంటల్లోపు వివరణాత్మక నివేదికను సమర్పించాలని ఆదేశించింది.
హైదరాబాద్ సీపీకిహెచ్‌ఆర్సీ నోటీసులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES