Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంగోదావరి-బనకచర్ల ప్రాజెక్ట్‌ను ఉపసంహరించుకోండి

గోదావరి-బనకచర్ల ప్రాజెక్ట్‌ను ఉపసంహరించుకోండి

- Advertisement -

– దాని వల్ల ఏపీకి ఆర్థికంగా నష్టం : ఏపీ సీఎం చంద్రబాబుకు మర్రి శశిధర్‌రెడ్డి లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

గోదావరి – బనకచర్ల ప్రాజెక్ట్‌ను ఉపసంహరించుకోవాలని మర్రి చెన్నారెడ్డి మెమోరియల్‌ ట్రస్ట్‌ కార్యదర్శి మర్రి శశిధర్‌రెడ్డి ఏపీ ప్రభుత్వానికి సూచించారు. గురువారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌ ప్రెస్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బనక చర్ల నిర్మాణానికి రూ.81 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారని అన్నారు. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలు వ్యతిరేకించడం, కేంద్రం నుంచి అనుమతులు రాకపోవడం తదితర కారణాల వల్ల ప్రాజెక్ట్‌ ఆలస్యం అవడంతో అంచనా వ్యయం భారీగా పెరుగుతుందని చెప్పారు. ఏపీకి చెందిన విద్యావేత్తలు, మేధావులు సైతం దీన్ని వ్యతిరేకిస్తున్నారని గుర్తు చేశారు. నిపుణుల అంచనాల ప్రకారం ఈ ప్రాజెక్ట్‌ పూర్తయ్యే వరకు రూ.5లక్షల కోట్లకు చేరుతుందని పేర్కొన్నారు. రాయలసీమలోని 30 లక్షల ఎకరాలకు సాగు నీరందించే కార్యక్రమాన్ని తాము వ్యతిరేకించడం లేదనీ, అయితే ఆ ప్రాజెక్ట్‌ వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన ‘నీరు-మీరు’ కార్యక్రమం ఎంతో సత్ఫలితాలు ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రముఖ నీటి పారుదల రంగ నిపుణులు హన్మంతరావు ప్రతిపాదించిన ఫోర్‌ వాటర్‌ కాన్సెప్ట్‌ను అమలు చేయాలని సూచించారు. రాజస్థాన్‌ ఈ పథకం ద్వారా ఎడారిలో పచ్చని ప్రకృతిని సృష్టించిందని అన్నారు. కరువులో సైతం మూడు పంటలు పండుతాయని పేర్కొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఆ దిశగా ఆలోచించాలని సూచించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img