Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంఫోన్‌ట్యాపింగ్‌ కేసులో నేడు సిట్‌ ముందుకు

ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో నేడు సిట్‌ ముందుకు

- Advertisement -

కేంద్రమంత్రి బండి సంజరు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి

రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో బాధితుడిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజరు శుక్రవారం సిట్‌ అధికారుల ఎదుట హాజరుకానున్నారు. దిల్‌కుషా గెస్ట్‌హౌజ్‌లో బండి సంజరు నుంచి వాంగ్మూలాన్ని స్వీకరించటానికి సిట్‌ అధికారులు అన్ని విధాలా ఏర్పాట్లను చేశారు. గెస్ట్‌హౌజ్‌ దగ్గర భారీ ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేసినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బండి సంజరుకు సంబంధించిన ఫోన్లను అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ట్యాపింగ్‌ చేసినట్టు ఆరోపణలున్నాయి. ముఖ్యంగా ఆ సమయంలో జరిగిన దుబ్బాక, హుజురాబాద్‌, మునుగోడు ఉపఎన్నికల సందర్భంగా తన ఫోన్లు ట్యాప్‌ అయినట్టు బండి సంజరు పలు మార్లు ఆరోపించాడు. ఈ నేపథ్యంలో తన ఫోన్లు ట్యాపింగ్‌ జరిగిన వైనంపై ఆయన సిట్‌ అధికారుల ఎదుట పూర్తి వివరాలను ఉంచనున్నట్టు తెలిసింది. ఈ తరుణంలో బండి సంజరు కొందరు ఐబీతో పాటు ఎస్‌ఐబీకి చెందిన మరికొందరు అధికారులతో సమావేశమై ఫోన్‌ట్యాపింగ్‌ వ్యవహారాన్ని చర్చించినట్టు సమాచారం. ఈ సందర్భంగా కొంత సమాచారాన్ని కేంద్ర ఐబీ అధికారులు బండి సంజరుకు అందజేశారని తెలిసింది. ఒకపక్క ఈ కేసును జాతీయస్థాయిలోకి తీసుకెళ్లి సీబీఐ చేత విచారణ జరిపించాలని పట్టుబడుతున్న బండి సంజరు.. సిట్‌ ఎదుట ఇచ్చే వాంగ్మూలం, చేసే డిమాండ్‌పై అందరి దృష్టి నెలకొన్నది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img