ఇఫ్లూలో స్వదేశీ, గిరిజన పరిశోధన పద్ధతులపై అంతర్జాతీయ సదస్సు
నవతెలంగాణ-ఉస్మానియా యూనివర్సిటీ
స్థానిక జ్ఞానాన్ని అనుబంధంగా కాకుండా పునాదిగా గుర్తించాలని, వలసవాదపు దృష్టికోణాలకు అతీతంగా విద్యా వ్యవస్థలు ముందుకు సాగాల్సిన అవసరం ఉందని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. హైదరాబాద్‌లోని ఇంగ్లీష్ అండ్ విదేశీ భాషల విశ్వవిద్యాలయం (ఇఫ్లూ)లో ”స్వదేశీ, గిరిజన సంఘాలు-పరిశోధన పద్ధతులను పునర్నిర్మించడం” అనే అంశంపై మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు గురువారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. స్వదేశీ జ్ఞాన వ్యవస్థలను అన్వేషిం చడానికి, పరిశోధనకు సంప్రదాయ విద్యావిధానాలపై పునరాలోచిం చడానికి పండితులు, పరిశోధకులు, సమాజ నాయకులను ఈ సదస్సు ఒకచో టకు చేర్చిందని తెలిపారు. స్థానిక సంస్కృతులను పాశ్చాత్య విద్యా ప్రమాణాల ద్వారా అంచనా వేయకూడదని చెప్పారు. విధాన చర్చలో గిరిజన జ్ఞానం, సంప్రదాయాలు, పర్యావరణ జ్ఞానాన్ని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.
ఇఫ్లూ వీసీ ప్రొ.ఎన్.నాగరాజు మాట్లాడుతూ.. స్వదేశీ ప్రపంచ దృక్పథాల విద్యా ప్రాముఖ్యతను, విస్తృత పరిశోధన, పర్యావరణ వ్యవస్థలో వాటికి స్థలాన్ని సృష్టించాల్సిన అవసరాన్ని చెప్పారు. భారతీయ, ప్రపంచ సాహిత్య విభాగంలో అధ్యాపక సభ్యులు డాక్టర్ కె.లావణ్య ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించి ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ వైఎల్. శ్రీనివాస్, ప్రొ. దీపక్ కుమార్ బెహెరా, కీనోట్ స్పీకర్ ప్రొ.అమరేశ్వర్ గల్లా, రిజిస్ట్రార్ ఐ/సి ప్రొ. హరిప్రసాద్, ప్రొక్టర్ ప్రొ. శ్యామ్‌రావు రాథోడ్, డీన్-స్కూల్ ఆఫ్ లిటరరీ స్టడీస్ ప్రొ. సోన్బా ఎం సాల్వే, కాన్ఫరెన్స్ కన్వీనర్ డాక్టర్ రాజునాయక్ విశ్వవిద్యా లయ అధ్యాపకులు, పరిశోధనా పండితులు, బోధనేతర ఉద్యోగులు పాల్గొన్నారు.
తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES