నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ఆలిండియా లాయర్స్ యూనియన్ (ఐలు), లా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో ఆస్తుల బదిలీ చట్టంపై (టీపీఏ) పై ఒకరోజు ప్రత్యేక శిక్షణా సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ న్యాయవేత్త, అధ్యాపకులు ప్రొఫెసర్ డాక్టర్ పి. రాజగోపాల్ హాజరై, ఆస్తుల బదిలీ చట్టంలోని కీలకాంశాలు, దాని ప్రాక్టికల్ అప్లికేషన్లు, న్యాయరంగంలో ఈ చట్టానికి ఉన్న ప్రాధాన్యత గురించి శిక్షణ ఇచ్చారు. ఇందులో 100 మందికి పైగా న్యాయ విద్యార్థు లు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఉత్సాహాంగా స్పందించి పలు ప్రశ్నలు అడిగారు. డాక్టర్ రాజగోపాల్ సమాధానాలు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ఐలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.పార్థసారథి ప్రారంభించారు. సంయుక్తం గా చేపడుతున్న విద్యా, న్యాయ సేవా కార్యక్రమాల గురించి ఐలు, ఎన్‌ఎస్‌ఎఫ్‌ఐ వివరించారు. కార్యక్రమం ముగింపులో డాక్టర్ రాజగోపాల్ సన్మానం చేశారు. ఈ తరహా శిక్షణా తరగతులను మరిన్ని నిర్వహించాల్సి ఉందని కన్వీనర్ బి. చంద్రకాంత్ తెలిపారు. న్యాయ విద్యార్థుల సామాజిక, నైతిక, న్యాయపరమైన అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుందని పేర్కొ న్నారు. ఈ కార్యక్రమంలో ఐలు తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీ కె. పార్థసారథి, హైదరాబాద్ సెక్రటరీ రామచంద్రరెడ్డి, కన్వీనర్ అలీ హైదర్, కో-కన్వీనర్ బి. చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఆస్తుల బదిలీ చట్టంపైఐలు, ఎల్‌ఎస్‌ఎఫ్‌ఐ శిక్షణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES