- Advertisement -
టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్
పదోవార్షికోత్సవం సందర్భంగా నవతెలంగాణ యాజమాన్యానికి, విలేకర్లకు టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ శుభాకాంక్షలు చెప్పారు. ప్రజారవాణా వ్యవస్థకు నవతెలంగాణ మద్దతుగా నిలుస్తున్నదని అన్నారు. అనేక విషయాలపై ప్రజలకు విశ్లేషణాత్మకమైన కథనాలను అందిస్తున్నదని వివరించారు. తాను పోలీస్ అధికారిగా ఉన్నప్పటి నుంచి ఈ పత్రికను చదువుతున్నానని చెప్పారు. ప్రజల్లో స్ఫూర్తినింపే విషయాలను అందిస్తున్నదని అన్నారు. రాబోయే రోజుల్లోనూ ప్రజల సమస్యలను ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.
- Advertisement -