నవతెలంగాణ – నకిరేకల్
సహచర కూలీలను పలకరిస్తూనే అనంత లోకాలకు వెళ్లిన హృదయ విచారకర సంఘటన శుక్రవారం ఉదయం నకిరేకల్ పట్టణంలో చోటుచేసుకుంది. తోటి కూలీలు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కేతేపల్లి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన చందుపట్ల తిరుపతమ్మ (45) సుతారి కూలి పని కోసం ప్రతిరోజు నకిరేకల్ పట్టణానికి వస్తుంది. ప్రతిరోజు లాగానే శుక్రవారం కూడా కూలి పని కోసం పట్టణంలోని ఇందిరాగాంధీ సెంటర్ కు చేరుకొని తోటి కూలీలతో మాట్లాడుతుండగానే అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. వెంటనే ఫిట్స్ వచ్చాయన్న ఉద్దేశంతో కూలీలు చేయాల్సిన సపర్యలు చేసిన ప్రాణం దక్కలేదు. అప్పటికే మృతి చెందినట్లు అక్కడ ఉన్నవారు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆమెకు భర్త, ఒక కూతురు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.
తోటి కూలీలను పలకరిస్తూనే…అనంత లోకాలకు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES