నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవి తాండకు నడుచుకుంటూ వస్తున్న క్రమంలో ఒక గుర్తు తెలియని వాహనం ఢీ కొని రూప్ల నాయక్ తండా కు చెందిన టీ బాలాజీ (50) మృతి చెందినట్లు ఎస్ హెచ్ ఓ జి సందీప్ తెలిపారు. అయన తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు శుక్రవారం వెకువ జామున రూప్లా నాయక్ తండా కు చెందిన టీ బాలాజీ రూప్లా నాయక్ తాండ నుండి దేవి తాండ కు జాతీయ రహదారి 44 పై నుండి నడుచుకుంటూ వస్తున్న క్రమంలో మృతుడు దేవి తండా గ్రామ శివారులోని మోతిలాల్ దాబా వద్ద కు వచ్చేసరికి ఏదో గుర్తు తెలియని వాహనం అతివేయంగా ఢీకొట్టింది. దీంతో తలకు, కాళ్లకు, చేతులకు, నడుముకు తివ్రగాయాలై అక్కడి కక్కడే మృతి చెందినట్లు ఎస్ హెచ్ ఓ జి సందీప్ వివరించారు. మృతుని కొడుకు తుంగర్ పవన్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి మర్చూరికి తరలించినట్లు ఎస్ హెచ్ ఓ తెలిపారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES