నవతెలంగాణ – కోహెడ
మండల కేంద్రానికి రేపు జిల్లా కార్యవర్గ నాయకులు హాజరు కానున్నట్లు కోహెడ గ్రామశాఖ అధ్యక్షుడు కొండబత్తిని రాజలింగం తెలిపారు. ఇటీవల పద్మశాలీ సంఘం నాయకులు పలు విభేదాలతో రెండు వర్గాలుగా విడిపోయి భోనాలను నిర్వహించడం తెలిసిందే. ఈ సందర్భంగా శుక్రవారం మండల కేంద్రంలోని సాయిబాబ ఆలయం సమీపంలో గౌరవ అధ్యక్షుడు మణేషంతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లా కార్యవర్గం నాయకులు హాజరై కుల సంఘం విడిపోయిన పరిస్థితులను అడిగి తెలుసుకొని సమస్యను సద్దుమణిగే దిశకు తీసుకురానున్నట్లు సమాచారం. అలాగే సంఘం రెండు వర్గాలుగా విడిపోవడంపై జిల్లా నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారని, చర్చల అనంతరం కొత్త కమిటీని ఏర్పాటు చెసే అవకాశం ఉందని ఆయన తెలిపారు. రెండు వర్గాలుగా విడిపోయే కంటే కలిసి ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పలువురు కోరుకుంటున్నారు.
రేపు కోహెడకు పద్మశాలీ జిల్లా కార్యవర్గం రాక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES