- Advertisement -
నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
అధిక వర్షాలు పడటంతో గురువారం చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలో పెళ్లి కోసం వెళ్తున్న కారు ఈదుల వాగు ప్రవహిస్తునడంతో వరద నీటిలో చిక్కుకొని కొట్టుకొని పోయింది. కారులో ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు. వీరంతా వలిగొండ మండలం వర్కట్ పల్లిలోని వివాహానికి హాజరవడానికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారులో ఉన్నవారు వెంటనే స్పందించి డోర్లు తీసేసుకుని ప్రాణాలతో బయటపడ్డారు. రాత్రి ఇంటికి వెళ్ళినవారు ఉదయం కారులో ఉన్న బంగారం వస్త్రాలు, లాప్ టాప్ లు తాడు సహాయంతో వరదలోకి దిగి తీసుకున్నారు. నెలపట్ల వర్కట్ పల్లి గ్రామాలకు రాకపోకలు పోలీసులు నిలిపివేశారు.
- Advertisement -