Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుతెలంగాణ యూనివర్సిటీ హాస్టల్ డిపాజిట్లను తగ్గించాలి: ఎస్ఎఫ్ఐ 

తెలంగాణ యూనివర్సిటీ హాస్టల్ డిపాజిట్లను తగ్గించాలి: ఎస్ఎఫ్ఐ 

- Advertisement -

నవతెలంగాణ – డిచ్ పల్లి
రాష్ట్రంలోని ఏ యూనివర్సిటీలో లేని విధంగా తెలంగాణ యూనివర్సిటీ లో హాస్టల్ డిపాజిట్ ఫీజులు ఆకాశాన్నంటాయని, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టల్ విద్యార్థులకు రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ పాటించకుండా ప్రతి హాస్టల్ విద్యార్థి నుండి పదివేల చొప్పున హాస్టల్ డిపాజిట్లను కట్టించుకోవడం అవివేకమని ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విఘ్నేష్ అవేదన వ్యక్తం చేశారు.

శుక్రవారం భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) తెలంగాణ యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో యూనివర్సిటీ లోని న్యూ బాయ్స్ హాస్టల్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి రాచకొండ విగ్నేష్ మాట్లాడుతూ  నాన్ స్కాలర్షిప్ , ఓసి  విద్యార్థులకు 18 వేల రూపాయల చొప్పున సంవత్సరానికి హాస్టల్ డిపాజిట్లను కట్టించుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో పేద మధ్యతరగతి విద్యార్థులే ఈ బోధన చేస్తున్నారని అలాంటి వారి వద్ద ఇలా వసుల్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

వెంటనే యూనివర్సిటీ ఉన్నతాధికారులు కలగజేసుకొని హాస్టల్ డిపాజిట్లను రూల్ ఆఫ్ రిజర్వేషన్లను పాటిస్తూ తగ్గించాలని డిమాండ్ చేశారు. లేకపోతే భవిష్యత్తులో ఉద్యమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ  రాష్ట్ర కమిటీ సభ్యులు రాజు, తెలంగాణ యూనివర్సిటీ అధ్యక్షులు జీషణ్, యూనివర్సిటీ ఉపాధ్యక్షులు నాగేంద్ర, నిరంజన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img