నవతెలంగాణ – భువనగిరి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని అన్ని మండలాల్లో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. వర్షం కురవడంతో పలు ప్రదేశాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. వర్షాలు పడడం లేదని ఇబ్బంది పడుతున్న వ్యవసాయదారులు ఒక్కసారిగా భారీ వర్షం రావడంతో వారు సంతోషంగా ఉన్నారు. భువనగిరి వరంగల్ రహదారి పక్కన ఉన్న చెట్ల కొమ్మలు అక్కడక్కడ విరిగి రోడ్డు మీద పడ్డాయి. రోడ్లపై ఇసుకమేటలు వచ్చి చేరాయి. రోడ్లపై ఇసుక మెటల్ వేయడంతో తెల్లవారుజామున ద్విచక్ర వాహనదార్లు కిందపడి గాయాల పాలైనారు.
వర్షం వివరాలు మిల్లీమీటర్లలో..
అత్యధిక వర్షపాతం ఆత్మకూర్ అడ్డగూడూర్ వలిగొండలో నమోదు కాగా అత్యల్పంగా యాదగిరిగుట్టలో నమోదయింది. ఆత్మకూరు 159.5, అడ్డగూడూరు 132.5, వలిగొండ 108.7, గుండాల 86, చౌటుప్పల్ 77.6, రామన్న పేట 69.9, మోత్కూరు 67.1, మోటకొండూరు 60.3, నారాయణపురం 55.3, భువనగిరి 51.2, ఆలేరు 47.1, రాజాపేట 45.9, పోచంపల్లి 39.5, బొమ్మలరామారం 39.3, బీబీనగర్ 32.8, తుర్కపల్లి 29.5, యాదగిరిగుట్ట 23.8 మిల్లీమీటర్ల వర్షపతం నమోదయింది. చెరువులకు కుంటల్లోకి నీరు వచ్చి చేరింది.
పొంగి పొర్లుతున్న మూసి..
గురువారం సాయంత్రం భారీ వర్షం కురవడంతో మూసి లోకి నీరు చేరి పొంగిపొర్లుతున్నాయి. మూసికొని రాత్రి పూర్తిగా మూసి రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. హిమాయత్‌సాగర్‌కు వరద ఉధృతి నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు. దీంతో మూసి ఉధృతి మరింత పెరిగింది. మూసి పరిహాక ప్రజలు లోతట్టు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.