Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఘనంగా పండుగ సాయన్న జయంతి..

ఘనంగా పండుగ సాయన్న జయంతి..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి
నిజాం రాజ్యంపై తిరుగుబాటు చేసిన విప్లవకారుడు పండుగ సాయన్న అని ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు కొలుపుల హరినాథ్ మున్సిపల్ మాజీ చైర్మన్ పెంట నరసింహులు కొనియాడారు. శుక్రవారం స్థానిక అమరవీరుల శుభం వద్ద పండుగ సాయన్న జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదప్రజలకు దానధర్మాలు చేసిన ప్రజా నాయకుడిగా, తెలంగాణ రాబిన్‌హుడ్ గా సుపరిచితుడని కానీ రాబిన్‌హుడ్ లాగా పండుగ సాయన్న కేవలం ధనవంతులను కొట్టి పేదవాళ్లకు పెట్టేవాడన్నారు.

సాయన్న 1840 నుంచి 1900 మధ్య కాలానికి చెందినవాడని, అతని తల్లి సాయమ్మ, తండ్రి అనంతయ్య అతను తెలంగాణలోని మహబూబ్‌ నగర్‌కు దగ్గర నవాబ్‌పేట మండలం, మెరుగోనిపల్లె గ్రామానికి చెందినవాడని అతను గ్రామీణ క్రీడల్లో ఆరితేరినవాడని 20 కేజీల గుండును అవలీలగా ఒక్కచేత్తో లేపే వాడని కొనియాడారు. శత్రుముకల మీద ఎద్దుల బండిని లేపి విసిరే పడవేసే యోధుడని తెలిపారు. దోపిడి ఆదిపత్యాల వర్గాల వారు తెలంగాణ సాయుధ విప్లవ పోరాట యోధులను బందిపోట్లుగా నాటి రజాకార్లు చిత్రించిన విధంగానే పండుగ సాయన్నను చిత్రీకరించారని ఆవేదన వ్యక్తపరిచారు. 

ఆకలితో అలమటించే ప్రజల కోసం సంపన్నుల ఇళ్లపై పడి గోదాములు పగులగొట్టి ధాన్యం బస్తాలు బైటకు తెచ్చి పంచిపెట్టాడు సాయన్న అన్నారు. సొంతంగా ఆయుధాలు తయారుచేసుకుంటు ఒక దళాన్ని ఏర్పాటు చేసుకున్నాడని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా ఫిషరీస్ట్ ఛైర్మన్ పాశం సంజయ్ బాబు,నాయకులు ఇట్టబోయిన గోపాల్, గొర్రెంకల శివశంకర్, ఎనబోయిన జంగీర్, సాదు విజయ్, ఉడుత భాస్కర్, పిట్టల బాలరాజు, దిద్దికాడి భగత్, కమ్మ వెంకటేష్, కొలుపుల నాగరాజు, శాగంటి నర్సింహ, గుర్రాల మల్లేష్,బీసుకుంట్ల జహంగీర్, బోయిని బాలయ్య, కానుక బాలరాజు, గుర్రాల శివ నాగేందర్, తుమ్మల నగేష్, మేడబోయిన సాయి, బూస కిష్టయ్య, సిదేన్కి కోటయ్య, కొలుపుల గణేష్, శ్రీకాంత్, బండి సూరి, బండి మహేష్, సాదు మనోజ్, పెంట నితీష్, ఇట్టబోయిన సత్యనారాయణ  పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img