Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్బ్రిడ్జి వేశారు.. రోడ్డు మరిచారు

బ్రిడ్జి వేశారు.. రోడ్డు మరిచారు

- Advertisement -

నవతెలంగాణ – సదాశివ నగర్ 
మండలంలోని కల్వరాల్ పద్మాజివాడి ఇరు గ్రామాల మధ్య బ్రిడ్జి నిర్మించారు. రోడ్డు ఎప్పుడు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇరు  గ్రామాల మధ్య వాగుపై బ్రిడ్జి నిర్మించి సంవత్సరాలు గడుస్తున్నా.. ఇప్పటివరకు రోడ్డుకు నోచుకోకపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు మారిన రోడ్డు మాత్రం అలానే నిలిచిపోయింది. రోడ్డు లేకపోవడంతో ఇరు గ్రామ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. కల్వరాల్ గ్రామస్తులకు 44వ జాతీయ రహదారి నుండి రావాలంటే కిలోమీటర్ వరకు ఎక్కువ దూరం అవుతుంది. ఏర్పాటు చేసిన బ్రిడ్జి ద్వారా వెళ్తే కిలోమీటర్ వరకు దూరం తగ్గుతుంది.

ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు పద్మాజివాడి చౌరస్తాకు రావాల్సి ఉంటుంది. చౌరస్తాలో ప్రాథమిక సహకార సంఘం తెలంగాణ గ్రామీణ బ్యాంకు, వారం వారం సంత, ఉంటుంది. హైదరాబాదు, బాన్సువాడ నిజామాబాద్, నిర్మల్, ఆర్మూర్, ఆదిలాబాద్ మహారాష్ట్ర ,పిట్లం, బిచ్కుంద తదితర ప్రాంతాలకు వెళ్లాలంటే పద్మాజివాడి   చౌరస్తా నుండి బస్సు సౌకర్యం కలదు .పద్మాజి వాడి చౌరస్తాలో అన్ని రకాల ఎక్స్ ప్రెస్ బస్సుల  స్టాపు ఉన్నది .చౌరస్తాలో దుకాణ సముదాయాలు కూడా సౌకర్యం కలదు ఎమ్మెల్యేలు మారిన ఎంపీలు మారిన ఇంతవరకు రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేయకపోవడంతో ఈ గ్రామాల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు స్పందించి రోడ్డు వేయించాలని  ఇరు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img