Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంబీజేపీలోకి గువ్వల బాలరాజు

బీజేపీలోకి గువ్వల బాలరాజు

- Advertisement -


– 10న చేరనున్నట్టు ప్రకటన
– రామచందర్‌రావుతో భేటీ

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌ : బీజేపీ పార్టీలో చేరబోతున్నట్టు బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అధికారికంగా ప్రకటించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.రాంచందర్‌రావుతో గువ్వల బాలరాజు భేటీ అయ్యారు. పార్టీలోకి వస్తే తనకిచ్చే ప్రాధాన్యతపై క్లారిటీ కోసం బాలరాజు బీజేపీ ఆఫీసుకు వచ్చినట్టు తెలిసింది. భేటీ అనంతరం ఆయన మీడియాతో బాలరాజు మాట్లాడారు. ఈ నెల 10న తానొక్కడినే చేరబోతున్నట్టు ప్రకటించారు. అచ్చంపేట నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌వాళ్లు ఎన్ని సభలు, సమావేశాలు పెట్టినా తననేమీ చేయలేరని స్పష్టం చేశారు. నియోజకవర్గ ప్రజలు, అనుచరులంతా తన వెంటే ఉంటారన్నారు. నల్లమల్ల ప్రాంతం లో బీజేపీ జెండా ఎగురవేస్తానని నొక్కి చెప్పారు. ఎవరెన్ని కుతంత్రాలు చేసినా ఎంతో కష్టపడి బీఆర్‌ఎస్‌ జెండాను చెట్టుకూ, పుట్టకూ, ఇంటింటికీ తీసుకెళ్లాననీ, అదే తరహాలో నల్లమలలో ఇంటింటికీ బీజేపీ జెండాను తీసుకెళ్తానని తెలిపారు. బీజేపీ విధానాలు నచ్చే ఆ పార్టీలో చేరబోతున్నట్టు ప్రకటించారు.
మెయినాబాద్‌ ఫామ్‌ కేసులో కీలకంగా ఉన్న గువ్వల బాలరాజు బీజేపీలో చేరబోతుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బీఎల్‌ సంతోశ్‌ ఆ కేసు నుంచి బయట పడేందుకు గువ్వల బాలరాజును పార్టీలో చేర్చుకోవాలని రాష్ట్ర నాయకత్వం మీద ఒత్తిడి చేసినట్టు తెలుస్తోంది. గువ్వల బాలరాజు కూడా ఆ కేసులో డబ్బుల వ్యవహారం గురించి చర్చ జరగలేదనీ, తనను ఈ విషయంలో కేసీఆర్‌ మూడు రోజుల పాటు బంధించారని ఇటీవల ఆరోపణలు చేసిన విషయం విదితమే.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img