Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయందోస్త్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ గడువు

దోస్త్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ గడువు

- Advertisement -

– 12 వరకు పొడిగింపు
– 13, 14 తేదీల్లో స్పాట్‌ అడ్మిషన్లు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
: రాష్ట్రంలో బీఏ, బీఎస్సీ, బీకాం, బీకాం ఒకేషనల్‌, బీకాం ఆనర్స్‌, బీఎస్‌డబ్ల్యూ, బీబీఏ, బీసీఏ, బీబీఎం, బీసీఏ కోర్సుల్లో 2025-26 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌లో భాగంగా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ గడువును ఈనెల 12 వరకు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మెన్‌, దోస్త్‌ కన్వీనర్‌ వి బాలకిష్టారెడ్డి, కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎ శ్రీదేవసేన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దోస్త్‌ ప్రత్యేక విడతలో 54,048 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించిన విషయం తెలిసిందే. అయిఏ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ గడువు శుక్రవారం వరకే అని ప్రకటించాయి. భారీ వర్షాలు, వరలక్ష్మి వ్రతం కారణంగా విద్యార్థులకు ఇబ్బందులు వచ్చాయి. దీంతో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ గడువును ఈనెల 12 వరకు పొడిగించామని తెలిపారు. కాలేజీల్లో రిపోర్టు చేసే గడువు కూడా ఈనెల 12 వరకు పొడిగించామని పేర్కొన్నారు. ప్రయివేటు డిగ్రీ కాలేజీలు, ఎయిడెడ్‌ డిగ్రీ కాలేజీల్లో (సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సులు మాత్రమే) స్పాట్‌ అడ్మిషన్ల ప్రక్రియ ఈనెల 13,14 తేదీల్లో నిర్వహించాలని సూచించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర వివరాల కోసం ష్ట్ర్‌్‌జూర://సశీర్‌.షస్త్రస్త్ర.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img