Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంస్వాతంత్రోద్యమంలో ముస్లింల త్యాగాలు విస్మరించలేనివి

స్వాతంత్రోద్యమంలో ముస్లింల త్యాగాలు విస్మరించలేనివి

- Advertisement -


– ఆవాజ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.డి అబ్బాస్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
: స్వతంత్య్ర పోరాటంలో ముస్లింల త్యాగాలు విస్మరించలేనివనీ, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అంశంపై సెమినార్లు, సదస్సులు, ఫోటో ఎగ్జిబిషన్లు నిర్వహించాలని ఆవాజ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం డి అబ్బాస్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఆవాజ్‌ రాష్ట్ర కార్యాలయంలో ఆవాజ్‌ రాష్ట్ర కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎండి అబ్బాస్‌ మాట్లాడుతూ భారత స్వతంత్రోద్యమంలో ముస్లింల పాత్ర, వారు చేసిన త్యాగాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని విజ్ఞప్తి చేశారు. అమరవీరుల స్ఫూర్తిని, త్యాగాలను నేటి తరానికి తెలియజేయడం కోసం ‘స్వాతంత్య్ర ఉద్యమంలో ముస్లింల పాత్ర’, అనే అంశంపై సెమినార్లు, సదస్సులు, ముస్లిం స్వాతంత్ర సమర యోధులకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్లు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఆ పోరాటంతో ఎలాంటి పాత్ర లేని సంఫ్‌ు పరివారం ముస్లింలపై దుష్ప్రచారం చేయడం తగదని హితవు పలికారు. దేశభక్తి గురించి సంఫ్‌ు పరివారం దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఎవరికి లేదని పేర్కొన్నారు. హిందువులు, ముస్లింలు ఐక్యంగా బ్రిటిష్‌ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడుతుంటే, సంఫ్‌ు పరివారం బ్రిటీష్‌ సామ్రాజ్యానికి ఊడిగం చేసిందని గుర్తు చేశారు. చరిత్రను వక్రీకరించడం కోసం బీజేపీి చరిత్ర పుస్తకాలను తిరగ రాస్తోందని విమర్శించారు. స్వాతంత్రం కోసం ప్రజలు చేసిన పోరాటాలను, త్యాగా లను గుర్తు చేసుకోవడం కోసం ఆవాజ్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం తీసుకున్నట్టు తెలిపారు. సమావేశంలో ఆవాజ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిఖుర్‌ రెహమాన్‌, అజీజ్‌ అహమ్మద్‌ ఖాన్‌, అబ్దుల్‌ నబీ, ఇక్బాల్‌, ఎంఎ జబ్బార్‌, అబ్దుల్‌ లతీఫ్‌, అక్మల్‌ పాషా, మహబూబ్‌ అలీ, కలీం, మహమ్మద్‌ గౌస్‌, సలీం, బాబుమియా, రహమతుల్లా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img