బెంగళూరు: ప్రభుత్వ రంగంలోని సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు సోరాబ్‌జీ పోచ్‌ఖానావాలా 144 వ జన్మదినాన్ని ఆ బ్యాంక్ వేడుక గా నిర్వహించింది. 1911లో స్థాపితమైన ఈ బ్యాంక్, భారత దేశంలో మొదటి స్వదేశీ వాణిజ్య బ్యాంక్‌గా పేరుగాంచింది. ఈ కార్యక్రమానికి ఆ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎంవి మురళి కృష్ణ, జోనల్ హెడ్ ధరసింగ్ నాయక్, రీజియనల్ హెడ్ కె. పార్థ సారథి నాయుడు హాజరయ్యారు.ఈ సందర్భంగా, బ్యాంక్ తన స్థాపకుడి వారసత్వాన్ని కొనసాగిస్తూ, ఆర్థిక చేరువ, సమగ్ర బ్యాంకింగ్, ఏం ఎస్ ఎంఈ లు, వ్యవసాయం, డిజిటల్ ప్లాట్‌ఫాంల ద్వారా సేవలను విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా 4,500 శాఖలకు విస్తరించి సేవలు అందిస్తున్నట్టు తెలిపింది.