నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో వారం పాటు వానలు పడే అవకాశముందనీ, పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి డాక్టర్ కె.నాగరత్న తెలిపారు. శనివారం ఎక్కువ ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయి. భారీ వర్షాలు నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా కురిసే అవకాశముంది. ఆదివారం నాడు కొమ్రంభీమ్ అసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. సోమవారం నాడు కొమ్రంభీం అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో, 12న ఆదిలాబాద్, కొమ్రంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 13,14,15 తేదీల్లో పలు చోట్ల భారీ వర్షాలు పడొచ్చు. ఈ మేరకు పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. శుక్రవారం ఉదయం 8:30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రాష్ట్రంలో 80 ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఈసాల తక్కళ్లపల్లిలో అత్యధికంగా 5.15 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
రాష్ట్రంలో వారం పాటు వానలుభారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES