Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeఆదిలాబాద్ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం..

ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం..

- Advertisement -

నవతెలంగాణ – బజార్ హాత్నూర్
ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని శనివారం మండలంలో ఘనంగా నిర్వహించారు. మండలంలోని జాతర్ల గ్రామంలో ఆదివాసి దినోత్సవం పురస్కరించుకొని కొమరం భీం చిత్రపటానికి పూలమాలలు వేసి ఆదివాసి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ ఈశ్వర్ మాట్లాడుతూ ఆదివాసుల జీవనశైలి విభిన్నంగా ఉంటుందని ఆదివాసులు ప్రకృతితో కలిసి జీవనం సాగిస్తారని కొనియాడారు. ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయాలు భావితరాలకు అందించే దిశగా యువత కదిలి రావాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఆదివాసి యువత ప్రభుత్వ రంగాలలో విద్య ఉద్యోగాలు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img