విద్యార్థినీలు అవకాశాలు సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలు అదిరోహించాలి..
జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి శంకర్..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
ఆది వాసీలు జాతి మూలాలను మరువకుండా తమ సంస్క్రతి సంప్రదాయాలను కాపాడుకుంటూ మూడనమ్మకాలను వీడి ఆర్ధికంగా బలోపేతం కావాలని జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారి శంకర్ అన్నారు. ప్రపంచ, ఆదివాసీ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా శనివారం గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు.సంత్ సేవాలాల్ సూచించిన నియమాలను ఆచరిస్తూ జీవింతంలో ముందుకు సాగాలన్నారు.
ఆదివాసీల హక్కులు తెలుసుకొని ప్రభుత్వాలు కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలు చేరుకోవాలన్నారు. మన గుర్తులను, సంప్రదాయాలను సంరక్షించే ప్రయత్నం చేయాలని మన వేషధారణ, గోర్ బాషను కాపాడుకోవాలన్నారు. జ్ఞానం సంపాదించుకునేందుకు తహతహలాడుతూ మూడనమ్మకాలను వీడి పేదరికం నుంచి బయటపడాలన్నారు. అనంతరం విద్యార్థినీలు ప్రదర్శించిన సాంస్క్రతిక ప్రదర్శనలు ఆలరించాయి. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ వసతి గృహం అధికారులు సాయి రాములు,లింగయ్య తదితర సిబ్బంది,విద్యార్ధినీ విద్యార్థులు పాల్గొన్నారు.