నవతెలంగాణ – పాలకుర్తి
రాఖీ పౌర్ణమి వేడుకలను పురస్కరించుకొని శనివారం మండల కేంద్రంలో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు ధారావత్ రాజేష్ నాయక్ లతో పాటు మండల అధ్యక్షులు, సోషల్ మీడియా నాయకులకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ ఆత్మీయతకు, అనురాగాలకు ప్రతీక రాఖి వేడుకలు అని తెలిపారు. ఇదే స్ఫూర్తితో రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం యువత కృషి చేయాలని, యువతకు తగిన ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండలాల అధ్యక్షులు హరీష్, యాకేష్, హరికృష్ణ లతోపాటు సోషల్ మీడియా నాయకులు పాల్గొన్నారు.
యూత్ కాంగ్రెస్ నాయకులకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES